కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపు ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు
Advertisement
- మహేశ్ గౌడ్, పొంగులేటి, వంశీకృష్ణకు బీఆర్ఎస్ నోటీసులు
- నోటీసులు జారీ చేసిన సోమ భరత్ కుమార్
- సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్
- తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని సూచన
- స్పందించకపోతే పరువు నష్టం సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Advertisement
కొండపోచమ్మ సాగర్ నీటిని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఈ నోటీసులు పంపించింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ వీటిని జారీ చేశారు.
కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటికే ‘వెలుగు’ దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు పంపించినట్లు తెలిపింది. అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణతో తాజాగా ముగ్గురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసింది.
తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ అంశానికి సంబంధించి చేసిన పోస్టులను వెంటనే బేషరతుగా తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది.
నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ లీగల్ సెల్ హెచ్చరించింది.